భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలో మే డే వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జెండాను కామ్రేడ్ బండి సత్యం, సీఐటీయూ జెండాను దుంపల రాజయ్య, హమాలీ యూనియన్ జెండాను మాలి జంపయ్య ఆవిష్కరించారు. అనంతరం దివంగత ఆవుల వెంకన్న స్మారక స్తూపం వద్ద నాయకులు, కార్మికులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా…