భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎ.వి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా భక్తుల కోసం పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఉదయం 6 గంటలకు కాకడ ఆరతితో కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, అనంతరం ఉదయం 6.30 గంటలకు పురుషసూక్త విధానంలో మహాభిషేకం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద…





