భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: జిల్లాలో విషాద ఘటన జరిగింది. రామన్నపేటలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని కంటైనర్ దూసుకురావడంతో హోంగార్డ్ ఉపేందర్ చారి టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తనతో ఉన్న కానిస్టేబుల్స్ చాకచక్యంగా వ్యవహరించి చిట్యాల వద్ద కంటైనర్ ను పట్టుకున్నారు. ఉపేందర్.. ప్రజల సేవలో అంకితభావంతో పనిచేసేవాడని, అయన మరణం బాధాకరం అని సహచరులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మరిన్ని కథనాలు:





