భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, శివంపేట మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత వారం పది రోజులుగా కల్లాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని, కొనుగోలు సాగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన…