భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట జిల్లా: తెలంగాణ మలిదశ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విస్మరించిందని ఉద్యమ నేత దుగ్యాల రవీందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యమకారులకు నెలకు రూ.20,000 పెన్షన్, 250 గజాల నివేశన స్థలం, ఉచిత ఆరోగ్యశ్రీ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా పట్టించుకోలేదన్నారు.

అనేకమంది ఉద్యమకారులు ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం…