భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల సౌకర్యార్థం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం బంకు యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం ఆయన మెదక్ పట్టణంలోని యజ్ఞయ్య భారత్ పెట్రోలియం బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టాకు వివరాలను పరిశీలించి, యూపీఐ, స్వైప్ సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మేనేజర్‌ను హెచ్చరించారు. తాగునీరు, మూత్రశాలలు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు బంకులను సీజ్ చేస్తామని…





