భార‌త్ స‌మాచార్.నెట్, వ‌న‌ప‌ర్తి: చిన్నంబావి మండలం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా, కనీస సౌకర్యాలు లేవని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన, అద్దె భవనంలో నడుస్తున్న తహశీల్దార్ కార్యాలయాన్ని, వారపు సంతను సందర్శించారు. అనంత‌రం వ్యాపారులతో, ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. మండల కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందన్నారు. ప్రజల సౌకర్యార్థం మండల…