భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం పనులు జరిగాయా లేదా అనే కోణంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులను గుర్తించిన అధికారులు ఆయా పనులకు సంబంధించిన నిధులను తక్షణమే రికవరీ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకత పాటించాలని హెచ్చరించారు.