భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్-విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా ఉత్సవం ‘గస్టో-2025-26’ క్రీడాతత్వం, సమష్టికృషి స్ఫూర్తితో విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో దాదాపు 60 విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన 120కి పైగా క్రీడా జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

గస్టో అంటే కేవలం గెలుపోటములు కాదని, క్రీడల ద్వారా జీవితంలోని గొప్ప పాఠాలను నేర్చుకోవచ్చని నిర్వాహకులు అభివర్ణించారు. ముగింపు వేడుకల్లో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్‌లు విజేతలకు ట్రోఫీలు, పతకాలు,…