భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయం పండుగ మారింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, మద్దతుదారులు భారీగా తరలి రావడంతో కార్యాలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గడవు ముగిసేలోపు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికారులు ఎన్నికల నియమాలు పాటిస్తూ పారదర్శకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.