భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడంలో ప్రొ.జయశంకర్ సార్ కృషి మరువలేనిదని అంబేద్కర్ యువజన సంఘం ఇనుగుర్తి పట్టణ అధ్యక్షులు గోపందాస్ కృష్ణ అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ సూచించిన సిద్ధాంతాలను అందిపుచ్చుకొని, ఆయన ఆశయాలను యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు నెరవేర్చడంలో ముందుండాలని సూచించారు. జయశంకర్ సార్ చూపిన…
తెలంగాణ సాధనలో జయశంకర్ కృషి మరువలేనిది: గోపందాస్ కృష్ణ





