భారత్ సమాచార్.నెట్: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని కేదార్‌నాథ్ ఆలయ (Kedarnath Temple) ద్వారాలు భక్తుల (Devotees) కోసం తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు అర్చకులు. ఈ వేడుకలకు విచ్చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) తొలి పూజ చేశారు. ఈ వేడుకల్లో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల కమిటీ సభ్యులు, అధికారులతో పాటు పూజారులు, వేద పండితులు పాల్గొన్నారు.

భారీ మంచు కారణంగా సుదీర్ఘకాలం మూసి ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని ఇవాళ…