భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: ఆదివాసి నాయకుడు, మణుగూరు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వం, నీతి ఆయోగ్ అనుబంధంగా ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య కొమరం లక్ష్మణరావు దంపతులను అభినందించి శాలువాతో సన్మానించారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు…