భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజలకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం అందించేందుకు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను మెదక్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ రకాల పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, సివిల్ వివాదాలు తదితర అంశాలను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే…