భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైసింగ్ తెలంగాణలో భాగంగా రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్ర భాగంగా నిలపాలనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా గ్రామస్థాయి నుంచి ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని తహసిల్దార్ చందనరేష్,స్పెషలాఫీసర్ మరియన్న,ఎంపీడీవో సింగారపు కుమార్ సర్పంచులకు,ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలఅభివృద్ధి పారదర్శకంగా అర్హులందరికీ అమలు చేయాలన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఎంపీడీవో కుమార్ అధ్యక్షతన మండల కేంద్రం నెల్లికుదురు అమూల్య గార్డెన్లో గురువారం మండల స్థాయి సమావేశం జరిగింది. దీనికి హాజరై…