భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: అణగారిన వర్గాల గొంతుక, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 28న నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్టలో భారీ స్మారకోపన్యాస సభను నిర్వహించనున్నారు. బుధవారం బోధన్‌లోని పీఆర్‌టీయూ భవన్‌లో ఈ కార్యక్రమ వాల్ పోస్టర్లను హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధులు ఆవిష్కరించారు.

నాలుగు దశాబ్దాల పాటు ఎన్‌కౌంటర్లు, లాకప్ డెత్‌లకు వ్యతిరేకంగా మాధవరావు చేసిన న్యాయపోరాటం చిరస్మరణీయమని ఈ సందర్భంగా న్యాయవాదులు కొనియాడారు. ఈ సభకు నల్సార్ వర్సిటీ వైస్ ఛాన్సలర్…