భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా:  పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్, ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (ఎ.ఆర్) కె. రామచంద్ర రావు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. వాల్మీకి ఒక సామాన్యునిగా జన్మించి, ఋషుల బోధనలతో మహర్షిగా మారి రామాయణాన్ని రచించి ఆదర్శాలను ప్రసారం చేశారని అధికారులు గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

వైభవంగా…