భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అడవిలో గల రజబలినగర్ గుత్తి కోయ ఆవాస ప్రాంతాన్ని మండల పరిషత్ అభివృద్ది అధికారి కావూరి మహాలక్ష్మి సందర్శించారు. అక్కడ ఇటీవల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలను తనకీ చేశారు. విద్యార్థులకు తగిన వసతులను త్వరలో కల్పిస్తామని, ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని తెలియజేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు చాలా చురుకుగా ఉన్నారని, వారికి కావలసిన వసతులను కల్పించాలని మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద…