భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్, క్షేత్రస్థాయి నిర్వహణపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల…