భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించి భూగర్భ జలాల పెంపు, సంరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (VB-GRAMJI) కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపు చర్యలపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల అమలుపై అధికారులతో…