భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వ్యవసాయ సన్నాహాలపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి వ్యవసాయ శాఖ సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పంటల సాగు పురోగతి, వర్షపాతం పరిస్థితులు, నీటి…





