భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సమస్యలపై దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల మే 20న బంద్ చేయనున్నట్లు ఆ అసోసియేషన్ ఈసి మెంబర్ కొండి శ్రీనివాస్ తెలిపారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆన్‌లైన్ ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మెడిసిన్లు అమ్మడాన్ని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నవీన్ రెడ్డి, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.