భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మెండోరా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మెండోరా మండల సూపర్వైజర్లు, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం మండలంలో మ్యాపింగ్ ప్రక్రియ 63 శాతమే పూర్తయిందని, మిగతా ప్రక్రియ నెమ్మదిగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్ఓలు (BLO) వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి, ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించి వారంలోగా…