భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లికుదురులో సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.
గ్రామాలను తరచూ సందర్శించాలి
ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్…






