భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన పార్వతమ్మగూడెం యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు హెచ్‌ఎం నరేంద్ర కుమార్ సతీమణి అలివేలు గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అభిమానులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
అలివేలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యేవారని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆమె ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు…





