భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా:  తిరుమలగిరి మండలం రాఘవాపురం గ్రామంలో మంగళవారం జరిగిన దుర్గమ్మ పండుగకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే దుర్గమ్మ పండుగ పూజలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జాతీయ సంస్కృతికి సంబంధించి ప్రాముఖ్యతను కలిగి ఉంది అని అన్నారు.గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ దేవిని ఆరాధించడం ద్వారా అందరి జీవితాల్లో శాంతి, సఖ్యత ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ పండుగ ఎలా జరుపుకోవాలో, దాని ప్రాధాన్యత మరియు జనసామాన్యానికి ఇచ్చే సందేశంపై వారు ప్రసంగించారు.…