భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా కోతుల గుంపు చేసిన దాడిలో ఒక యువకుడు భవనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సాపూర్‌కు చెందిన గణేష్ అనే యువకుడు తన ఇంటిపై కూర్చుని ఉన్న సమయంలో, ఒక్కసారిగా కోతుల గుంపు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆకస్మికంగా జరిగిన ఈ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో గణేష్ అదుపుతప్పి భవనం పైనుంచి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో గణేష్‌కు బలమైన…





