భారత్ సమాచార్, ములుగు జిల్లా: వెంకటాపూర్ మండలం కేశావపూర్ గ్రామంలో కోతులు బీభత్సం సృష్టించాయి. కేశవపూర్ గ్రామంలో కంసాలి రాజు తన ఇంటి ముందు పనిచేస్తుండగా కోతులు దాడి చేసి ఎడమ చెవిను కొరికి పట్టుకొని వెళ్లాయి. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హుటాహుటిన వెంటనే స్థానికులు, కుటుంబసభ్యులు రాజును ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. గతకొన్ని రోజులుగా కేశవాపూర్ గ్రామంలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కోతులు జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు…