భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బైంసా పట్టణంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వీధికుక్కల దాడిలో దాదాపు ఇరవై మంది వరకూ గాయపడ్డారు. ఒకే రోజు ఇంత మంది గాయపడటంతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే కుక్కలదాడిలో గాయపడిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు. దీంతో గాయాలపాలైన వారిని చికిత్స అందించేందుకు భైంసా ఏరియా ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. భైంసాలోని జుల్ఫికర్ గల్లీ, గణేష్ నగర్, రాజీవ్ నగర్, పంజెషా చౌక్, ఓవైసీ నగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల దాడికి అనేక…