భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుపై దృష్టి సారించిందని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు అరగంట ప్రయాణంలోనే ఉన్నత విద్యను అభ్యసించేలా అవసరమైన విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ₹7.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్కు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.
నెల్లికుదురు మండల…






