భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : ఇనుగుర్తి మండలంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో ఎంపీడీవో బండారు పార్థసారథి పాల్గొని, శిక్షణ పొందిన 112 మంది సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండి, గ్రామసభల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

వార్డుల్లోని తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లాలని…





