భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్‌కు ఎంపికైనట్లు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మంగళవారం వెల్లడించారు. దేశంలోని ప్రముఖ సైన్స్ అకాడమీలు సంయుక్తంగా అందించే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) – సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు యూనివర్సిటీలోని సీఎస్‌ఈ-AIML విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్. ధారకేశ్ ఎంపికయ్యాడని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థి ధారకేశ్‌కు రూ. 25,000/-…
విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థికి జాతీయస్థాయి ఫెలోషిప్





