భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం బోధన్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ తహసీల్దార్ విట్టల్, ఏటీఓ గంగులింగ పాల్గొనగా, విశిష్ట అతిథులుగా రవికిరణ్, బాలగంగాధర్ హాజరయ్యారు. సంఘం సభాధ్యక్షులు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విఠల్ రావు, దావులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో పెన్షన్ వ్యవస్థకు మూలకర్త అయిన డి.ఎస్. నకారా చిత్రపటానికి పుష్పాంజలి…