భారత్ సమాచార్, మెదక్ జిల్లా: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలో స్థానిక రెవిన్యూ డివిజనల్ అధికారి మహిపాల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం అనంతరము RDO కార్యాలయం వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, పురపాలక సంఘం సిబ్బంది, రెవెన్యూ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.