భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సింగారపు కుమార్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని…