భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అప్రమత్తం చేశారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకూడదని హెచ్చరించారు. పొంగిపొర్లే వాగులు, వంకలు, నిండిన జలాశయాల వద్దకు ఎవ్వరూ వెళ్లకూడదని, రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. జిల్లా…