భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ‌ మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వాహణలో పోలీసులు చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి సేవలు వెలకట్టలేమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.