భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించామని, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డోంగ్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మొఘ గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలన్నారు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు అందేలా కృషి చేస్తుందన్నారు. ప్రైవేట్ బడి వద్దు – ప్రభుత్వ బడి ముద్దు అన్నారు. రానున్న వర్షాల వలన వ్యాధులకు…