భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై కూడా కుక్కలు దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవడంతో పాటు మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం, 19 నెలల వయస్సు గల వేదాన్ష్, రెండేళ్ల…