భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో వృద్ధ దంపతులను జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు, ఐపీఎస్ పరామర్శించారు. ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని వేగంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.బాధితులు సావిత్రి, అంజయ్యలను ఎస్పీ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనతో కలిగిన భయాందోళనలను తొలగిస్తూ,…