భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నర్సాపూర్ రైతు వేదికలో సోమవారం “రైతు వారోత్సవాల”ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. నేల ఆరోగ్య సంరక్షణపై రైతులందరితో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్షల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం రైతులకు మట్టి ఆరోగ్య కార్డులను పంపిణీ చేసి, భూసారాన్ని బట్టి ఎరువులను ఎలా వాడాలో అవగాహన…