భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy) ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పరుగుల వరద పారించాడు. గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, బౌండరీల మోత మోగించాడు. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి మైదానంలో విధ్వంసం సృష్టించాడు.
ముంబై ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ (Sarfaraz Khan).. 56 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం…




