భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు నేడు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆందోల్ నియోజకవర్గం, చౌటకూర్ మండలం సుల్తాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ ఏర్పాట్లు, ఓటర్ల క్యూలైన్ నిర్వహణను పరిశీలించారు. ముఖ్యంగా, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును…