భారత్ సమాచార్.నెట్, కొమురం భీమ్ జిల్లా : విజయదశమి పండుగను పురస్కరించుకుని బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు, నాయకులంతా ఏకమై, బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా శమీ (జమ్మి) చెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. విజయాలను చేకూర్చే ఈ శమీ వృక్షాన్ని పూజించిన అనంతరం, స్థానిక ఆలయాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు ఒకరికొకరు శమీ ఆకులను ఇచ్చిపుచ్చుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.…





