భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలను తాకుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధర రెండు లక్షల మార్కును దాటేయగా, బంగారం ధర కూడా భారీగా పెరిగింది.
హైదరాబాద్‌లో తాజా ధరలు (శుక్రవారం):
వెండి (కేజీ): ఏకంగా ₹2,37,000 కు చేరి రికార్డు సృష్టించింది.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఒక దశలో ₹1,42,800 పలికింది.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): దీని ధర ₹1,28,350 గా నమోదైంది.
…





