భార‌త్ స‌మాచార్.నెట్, వనపర్తి: బాలికల సంరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బాల్య వివాహాలు జరగకుండా పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పోషణ మాసం, బేటీ బచావో – బేటీ పఢావో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో జరుగుతున్న పోషణ మాసం, బేటీ బచావో – బేటీ పఢావో కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.

పిల్లలు, మహిళలకు పౌష్టికాహార లోపం వల్ల…