భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, కమిషనర్ జాదవ్ కృష్ణ కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సులు, వాటర్ ట్యాప్ ఛార్జీల వసూళ్ల స్థితిపై వారు ప్రధానంగా దృష్టి సారించారు.

పెండింగ్ బకాయిల వసూళ్లలో అలసత్వం చూపకుండా, వసూళ్ల శాతం పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పౌరసేవల మెరుగుదలకు మున్సిపాలిటీ ఆదాయ వనరుల సమర్థ వినియోగం…