భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి నుంచి మెదక్ వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి చలంగారి దండే అపర్ణ ఆరోపించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరిగినప్పటికీ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాదయాత్రపై పలు విమర్శలు చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి–మెదక్ రహదారి నిర్మాణం…





