భారత్ సమాచార్.నెట్, మెదక్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ మండలం రాయనపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్నదాతలు శ్రమించి పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో 498 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులంతా కేంద్రాలను పర్యవేక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు,…