భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం చీక్ మద్దూర్ గ్రామానికి చెందిన బీ.రాములు అలియాస్ రమేష్(45) బుధవారం తెల్లవారుజామున హత్నూర సమీపంలోని కొన్యాల చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రమేష్ బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో భార్యతో గొడవపడి బయలుదేరిన రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. రమేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు…